SSC CGL Notification 2026 in telugu
SSC CGL Notification 2026 in telugu: నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి SSC CGL Notification విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ SSC CGL Notification 2026 ద్వారా రైల్వే, ఇంటలిజెన్స్ బ్యూరో, ఎక్స్టర్నల్ అఫైర్స్, టాక్సెస్, పోస్టల్, హోమ్ అఫైర్స్ మరియు తదితర డిపార్ట్మెంటులలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా మంత్రిత్వ శాఖలో గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు టాప్ సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి చాలా కాంపిటీషన్ ఉంటుంది.
ఈ SSC CGL Notification 2026 నోటిఫికేషన్ మే 21, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం మే 21, 2026వ తేదీ నుండి జూన్ 22, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జూన్ 23, 2026.
అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే జూన్ 29, 2026వ తేదీ నుండి జూలై 1, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా 12,256 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ – 2, ఆఫీసు సుపరిండెంట్, సెక్షన్ హెడ్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit:
18 సంవత్సరముల నుండి 27, 30, 32 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.(ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేటు ఆగస్టు 01, 2026)
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరముల 3 సంవత్సరముల ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఆగస్టు 01, 2026 వ తేదీ నాటికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.(అంటే ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అర్హులే.)
అయితే ఈ క్రింది రెండు పోస్టులకి క్వాలిఫికేషన్
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 12th స్టాండర్డ్ లో మ్యాథమెటిక్స్ లో 60% మార్కులతో పాసై, ఏదైనా డిసి ప్లేన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినవారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. లేదా
బ్యాచిలర్స్ డిగ్రీను స్టాటిస్టిక్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ – 2: స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా డెమోగ్రఫీ లేదా పాపులేషన్ స్టడీస్ లేదా ఆపరేషన్ రీసెర్చ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.

Selection Process:
TIER – 1 మరియు TIER – 2 ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
TIER – 1:
| సబ్జెక్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
| జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ | 25 | 50 |
| జనరల్ అవేర్నెస్ | 25 | 50 |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 |
| ఇంగ్లీషు కంప్రహెన్షన్ | 25 | 50 |
100 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. గంట సమయం పాటు ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కొత్తగా సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. ప్రతి సెక్షన్ను 15 నిమిషాల చొప్పున విభజించడం జరిగింది. ఇంగ్లీషు మరియు హిందీ మీడియంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంది. టియర్ -1 ఎగ్జామ్ ను ఆగస్టు – సెప్టెంబర్ 2026 లో నిర్వహించడం జరుగుతుంది. టియర్ – 2 పరీక్ష ను డిసెంబర్, 2026 లో నిర్వహించడం జరుగుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 పోస్టులు
Examination Centre:
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు,
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు SSC.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయి SSC CGL notification 2026 పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. మే 21, 2026వ తేదీ నుండి జూన్ 22, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ SSC CGL Notification 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జూన్ 23, 2026.
Salary:
ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే నెలకు ఆయా పోస్టులను బట్టి సాలరీ మారుతుంది. బేసిక్ పే..
పే లెవెల్ – 8: 47,800 రూపాయలు – 151100 రూపాయలు
పే లెవెల్ – 7: 44900 రూపాయలు – 142400 రూపాయలు
పే లెవెల్ – 6: 35400 రూపాయలు – 112400 రూపాయలు
పే లెవెల్ – 5: 29200 రూపాయలు – 92300 రూపాయలు
పే లెవెల్ – 4: 25500 రూపాయలు – 81100 రూపాయలు
అలాగే అదనంగా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
Note: అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ ని క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Official Website: SSC.gov.in
2 thoughts on “డిగ్రీ అర్హతతో 12,256 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు! SSC CGL Notification 2026 in telugu”